Friday, July 30, 2010

Pattadar Passbooks Details

Thursday, July 29, 2010

స్థలపురాణం




కొన్ని శతాబ్దాల క్రితం నూజివీడు జమిందారు ధర్మ అప్పారావు సద్ బ్రాహ్మణులకు అగ్రహారములను దానమిచ్చినట్టు తెలుస్తుంది. ఒకనాడు ఆయన సేవకులతో అరణ్యమర్గాన వేలుచుండగా ఒక బోటి(స్త్రీ)భక్తి పారవశ్యముతో గానం చేస్తుండగా విని ఆనందభరితులై ఈ స్తలమహత్యాన్ని విని నాటి మహా విద్వంసమణులైన చీమలకొండ వారి పవిత్ర వంశీయులకు దానమిచ్చినారు.నాటి బోటిపాట నేటి బోడపాడు అయిoదని ప్రతీతి. కొన్నాళ్ళకు అగ్రహారికులైన శ్రీ చిమలకొండ వారు పలువురు సద్ బ్రాహ్మణ కుటుంబీకులు శిష్యగణంతో ఇక్కడకు వలస వచ్చారు.ఈ అరణ్య ప్రాంతాన్ని నివాసయోగ్యంగా మార్చి వేదాద్యాయన తత్పరులై నిరతము కాలం గడిపారు.ఒక రోజు వారికి ఆది దంపతులైన ఉమామహేశ్వరులు ప్రసన్నమూర్తులై దర్శనమిచ్చి "మీరు శుద్ధి చేసే ప్రదేశంలో (నేడు ఆలయం ఉన్న ప్రదేశంలో)మేమంతర్గతలమై ఉన్నామని చెప్పి మాయమైయారని, మరునాటి ఉదయాన ఈ శుభ స్వప్న వృతాంతం ఆధారంగా ఆ ప్రదేశంలో తవ్వగా భూమి నుంచి 'ఓం'కార ధ్వనులు ప్రారంభమవడంతో వారు ఆశ్చర్యానికి గురైయ్యారు. దీంతో త్రవ్వకానికి ఉపయోగించిన సామ్రాగ్రిని ప్రక్కన పెట్టి స్వహస్తాలతో మట్టిని తీసారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారు, బాలత్రిపుర సుందరీ, శ్రీ గణపతి సహితుడై దర్శనమిచ్చినారు. వారిని అక్కడే బధ్ర పరచి, చిన్న ఆలయం నిర్మించి నాటినుండి సేవలు చేస్తున్నారు. తర్వాత ఒక పెద్ద శివలింగం, ఒక నంది, చిన్న గణపతి విగ్రహం కాల్వలో దొరికాయి. వాటిని వడ్డుకు చేర్చి ఆలయం నిర్మించాలని తలస్తే, స్వామి స్వప్నంలో కనిపించి వాటిని ఒక్కడే అలాగే ఉంచాలని చెప్పడంతో ఒక్కడే నేటికి పూజలు నిర్వహిస్తున్నారు.